Tirupathiలో విషాదం.. మొదటి అంతస్తు నుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి
మొదటి అంతస్తు నుంచి మూడేళ్ల బాలుడు కింద పడి మృతి చెందిన విషాద ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. కడప జిల్లాకి చెందిన ఓ కుటుంబం దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. పద్మనాభ నిలయం దగ్గర మూడేళ్ల బాలుడు ఆడుతూ ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు నుంచి కింద పడ్డి మృతి చెందాడు.