Tiger: వరంగల్లో పులి సంచారం.. పంట పొలాల్లోనే తిష్ట!
వరంగల్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. రుద్రగుడెం పరిసర గ్రామాల పంటపొలాల్లో పులి అడుగులు గుర్తించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. టైగర్ తిరుగుతున్నట్లు నిర్ధారించిన నర్సంపేట రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ ప్రజలను అప్రమత్తం చేశారు.
Tiger: శృంగార వేట.. తాడ్వాయి అడవుల్లో తిష్టవేసిన బెంగాల్ టైగర్!
గత రెండు నెలలుగా ఆడ తోడుకోసం ఆడవులన్నీ జల్లెడపడుతూ సంచరిస్తున్న పెద్దపులి మార్గాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మేటింగ్ కోసం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ములుగు తాడ్వాయి అడవుల్లో తిష్టవేసినట్లు అటవీశాఖ రేంజ్ అధికారి సత్తయ్య వెల్లడించారు.
Tiger: పులి మనిషి రక్తానికి మరిగిందా.. లక్ష్మిపై దాడిలో భయంకర నిజాలు!
లక్ష్మిపై పులిదాడి ఘటనలో భయంకర నిజాలు బయటపడ్డాయి. కొత్త ఆవాసం, ఆడపులులతో శృంగారం, ఆహారం దొరకనపుడు వాటి మానసికస్థితి దెబ్బతింటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే ఎదురుపడిన పశువులు, మనుషులను చంపుతాయని చెప్పారు.
పులి దాడి బాధితులరాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం!
ఆసిఫాబాద్ జిల్లాలో పులిదాడిలో మరణించిన యువతి లక్ష్మి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం అందించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియ పూర్తిచేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
Nellore: భయపడొద్దు పులి పారిపోయింది.. చిరుత సంచారంపై అటవిశాఖ క్లారిటీ!
నెల్లూరు పెంచలకోన దేవాలయ పరిసర ప్రాంతాల్లో సంచరించిన చిరుతపులి గురించి ఎవరూ భయపడొద్దని అటవీశాఖ అధికారులు చెప్పారు. పులి అక్కడినుంచి పారిపోయిందని, భక్తులు భయబ్రాంతులకు గురికావద్దని సూచించారు. ఒంటరిగా తిరగొద్దని, అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
శృంగారం కోసం 300 కి.మీ ప్రయాణించిన పులి.. సహచరి ఎక్కడ దొరికిందంటే!
శృంగారం కోసం 'లవ్లోర్న్ జానీ' అనే మగపులి 300 కి.మీ ప్రయాణించింది. సహచరికోసం మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ నడుచుకుంటూ వచ్చింది. ఇవి 100 కి.మీ దూరం నుంచి ఆడ పులులు విడుదల చేసే ప్రత్యేక సువాసనను గుర్తించగలవని అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ తెలిపారు.