Thailand: థాయ్‌లాండ్‌లో కీలక పరిణామం.. ప్రధానిపై వేటు
థాయ్‌లాండ్ ప్రధానమంత్రి స్రెత్తా థావిసిన్ పై వేటు పడింది. నేరారోపణ ఉన్న ఓ న్యాయవాదిని తన మంత్రివర్గంలో నియమించుకుని నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆయనను కోర్టు పదవి నుంచి తొలగించింది.
థాయ్‌లాండ్ ప్రధానమంత్రి స్రెత్తా థావిసిన్ పై వేటు పడింది. నేరారోపణ ఉన్న ఓ న్యాయవాదిని తన మంత్రివర్గంలో నియమించుకుని నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆయనను కోర్టు పదవి నుంచి తొలగించింది.
హోటల్ రెంట్ గురించి చింతించకుండా సెలవులను హాయిగా ఆస్వాదించగలగే నగరాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. తాజాగా డిజిటల్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ అగోడా ప్రపంచంలోనే చౌకైన హోటల్ రూమ్స్ కలిగిన నగరాల జాబితాను విడుదల చేసింది. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
సాహసాలే జీవితంగా బతుకుతున్నాడు. కానీ అదే ఇప్పుడు అతని ప్రాణం తీసింది. సోషల్ మీడియా కోసం బ్రిటీష్ స్కై డైవర్ చేసిన సాహసం వచివరకు విషాదంగా మిగిలింది. 29వ అంతస్తు నుంచి జంప్ చేస్తూ ప్యారాచూట్ తెరుచుకోకపోవడం వలన ప్రాణాలు కోల్పోయాడు.
థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్కార్న్ గడుపుతున్న జీవితాన్ని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన కింగ్ వజిరాలాంగ్ కోర్న్ వద్ద మీ ఊహకు అందని వజ్రాలు, నాణేలు ఉన్నాయి.8 విమానాలు, 300 కార్లు, 98 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి.
థాయ్‌లాండ్‌లో మరో కొత్త వైరస్ బయటపడటం కలకలం రేపుతోంది. ఈ వైరస్ వల్ల గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకోఎల్త్ అలయన్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ వైరస్‌కు కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
థాయ్‌లాండ్‌లో 49 మందితో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఎట్టకేలకు గాజాలో కాల్పుల విరమణ జరిగింది. దీనితో పాటు, హమాస్ 25 మంది బందీలను విడుదల చేసింది. వారిలో 13 మంది ఇజ్రాయెల్‌లు ఉన్నారు. హమాస్‌లో ఇప్పటికీ 200 మందికి పైగా బందీలుగా ఉన్నారు.
భారత్, తైవాన్ నుంచి వచ్చే టూరిస్టుల కోసం వీసా లేకుండానే ఉచిత ప్రవేశాన్ని కల్పించనుంది థాయ్‌లాండ్ ప్రభుత్వం. వీసా లేకుండానే సుమారు 30 రోజుల పాటు తమ దేశంలో పర్యటించవచ్చని అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ ఏడాది 28 మిలియన్ల మంది టూరిస్టులను ఆకర్షించాలని థాయ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
స్వదేశంలో మొదటిసారిగా జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫిలో టైటిల్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆరు జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ నేడు ( అక్టోబర్ 27) రాంచీలో షురూ అవుతుంది. మొదటిరోజు థాయ్ లాండ్ జట్టుతో సవితా పూనియా కెప్టెన్సీలోని భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8.30గంటల నుంచి ప్రారంభం అవుతుంది.