TG Crime : వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా NH 44 జాతీయ రహదారిపై లారీలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆ లారీల వెనుక వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.