TG CRIME : దేవుడికి దండం పెట్టి.. మొగుడికి స్పాట్ పెట్టిన పెళ్లాం.. మేడ్చల్లో దారుణం

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది ఓ ఇల్లాలు. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా కీసరలో చోటుచేసుకోగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
medchal

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది ఓ ఇల్లాలు. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా కీసరలో చోటుచేసుకోగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ రాజేష్‌ చంద్ర వెల్లడించిన వివరాలు ప్రకారం.. కీసర ప్రాంతానికి చెందిన నవనీతకు ఆమె మేన బావ నరేష్‌తో 2012లో పెళ్లి అయింది. ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. అయితే కొంత కాలం క్రితం ఆంజనేయులు అనే మరో వ్యక్తి వద్దకు కూలీ పనులకు వెళ్లారు. అక్కడ ఆంజనేయులుకు, నవనీతకు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.

కొద్ది రోజులుగా వీరిద్దరి వ్యవహారంపై అనుమానం వచ్చిన నరేష్‌  తన భార్య నవనీతను టార్చర్ మొదలు పెట్టాడు. దీంతో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలని  ప్రియుడు అంజనేయులుతో కలిసి నవనీత స్కెచ్ వేసింది. ఈ నెల15వ తేదీన  దైవదర్శనం కోసం అని చెప్పి నరేష్‌ను ఒప్పించి ప్రియుడు అంజనేయులుతో కలిసి బైక్‌పై పెద్దగుట్ట వెళ్లింది నవనీత.  దర్శనం తరువాత తిరుగు ప్రయాణంలో గాంధారి సమీపంలో ఆగి అక్కడ ఫుల్ మద్యం సేవించారు. నరేష్‌కు అతిగా మద్యం తాగించి పడిపోయాక ఆపై తీవ్రంగా కొట్టి హత్య చేశారు.

మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి

ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి కాల్చివేశారు. గాంధారి శివారు లోని చద్మల్‌ వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న ఓ కాలువలో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి ఆంజనేయులు, నవనీతలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. కేసును చాలా చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సంతోష్‌ కుమార్‌, ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది సంజయ్‌, రవికుమార్‌, సాయిబాబా, ప్రసాద్‌, బంతీలాల్‌ లను ఎస్పీ  అభినందించారు.

Also Read :  Mass Jathara: సూపర్ డూపర్ హిట్ సాంగ్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న 'మాస్ జాతర' పాట ! ఇన్ని మిలియన్ వ్యూసా!

Advertisment
తాజా కథనాలు