Rashmika-Vijay Marriage : మేం పెళ్లి చేసుకోబోతున్నాం.. విజయ్, రష్మిక పెళ్లి ప్రకటన

ఎట్టకేలకు టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మొదటిసారి స్పందించారు. తాజాగా ఇద్దరు అధికారికంగా ప్రకటించారు.

New Update
vijay

ఎట్టకేలకు టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మొదటిసారి స్పందించారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ, ఈ జంట ఎప్పుడూ నేరుగా సమాధానం చెప్పలేదు. తాజాగా ఇద్దరు అధికారికంగా ప్రకటించారు. అభిమానులు తమ ఇద్దరి పేర్లను కలిపి ఎంతో ముద్దుగా 'విరోష్' (ViRash) అని పిలుచుకుంటున్నారని, ఆ పేరునే తమ పెళ్లికి అధికారికంగా వాడుతున్నట్లు ప్రకటించారు.

వెడ్డింగ్ ఆఫ్ విరోష్

 "మేము ఏదైనా అనుకునేలోపే మా ఫ్యాన్స్ అన్నీ చేసేస్తున్నారు. వారు పెట్టిన 'విరోష్' అనే పేరు మాకు బాగా నచ్చింది. అందుకే మా పెళ్లి వేడుకకు 'వెడ్డింగ్ ఆఫ్ విరోష్' అని పేరు పెట్టాం" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 2026 ఫిబ్రవరి 26వ తేదీన వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ లో వీరి పెళ్లి వేడుక జరగనుంది. 

పెళ్లి తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. వీరి పెళ్లికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.  కాగా 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మెరిసిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలోనూ తోడుగా నడవాలని నిర్ణయించుకోవడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు