🔴 Delhi Assembly Elections 2025 Live Updates: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. లైవ్ అప్డేట్స్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
తెలంగాణలో బీసీ జనాభా తగ్గలేదని.. పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. 2014లో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల జనాభా- 51 శాతం అన్నారు. 2024 లో కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే ప్రకారం బీసీల జనాభా-56.33 శాతంగా తేలిందన్నారు.
రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని APCC చీఫ్ షర్మిల ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే తేలిందన్నారు. ఏపీలో కులగణన రిపోర్ట్ ను జగన్ ప్రభుత్వం కావాలనే తొక్కిపెట్టిందన్నారు.
వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సైతం అధికారుల విషయంలో తాను కాంప్రమైస్ కాలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాపై తగ్గేదేలేదన్నారు. తన ఇంట్లో వైఎస్సార్ పాటు కేసీఆర్ ఫోటోలు కూడా ఉన్నాయన్నారు. నచ్చిన నేతల ఫొటోలను పెట్టుకుంటే తప్పేంటన్నారు.
అక్రమార్కులపై హైడ్రా మరోసారి ఉక్కుపాదం మోపింది. పలు అక్రమ నిర్మాణాలను నేల మట్టం చేసింది. శంషాబాద్ లో పార్కు, రోడ్డు, ఇతర ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు.
ఢిల్లీ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ గెలుపోటములు తెలుగు పాలిటిక్స్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్న అభిప్రాయాన్ని పొలిటికల్ పండితులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి విశ్లేషణను ఇక్కడ చూడండి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ లేదని ప్రకటించారు. బడ్జెట్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.
జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందని కేటీఆర్ అన్నారు. BJP, కాంగ్రెస్ కు చెందిన 16 మంది ఎంపీలు బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది '0' అని అన్నారు. కేంద్రానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి తేలిపోయిందన్నారు.
ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది బీహార్ బడ్జెట్ లాగా ఉందని అభివర్ణించారు. రేవంత్ రెడ్డి కోతల రెడ్డి లాగా మారారని ఫైర్ అయ్యారు.