BIG BREAKING: తెలంగాణలో సీఎం మార్పు
తెలంగాణలో సీఎం మార్పుపై బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇప్పటికే తెలంగాణ ఇన్ఛార్జ్ ను మార్చిందన్నారు. నెక్స్ట్ సీఎం రేవంత్ ను మార్చనుందని జోస్యం చెప్పారు.
తెలంగాణలో సీఎం మార్పుపై బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇప్పటికే తెలంగాణ ఇన్ఛార్జ్ ను మార్చిందన్నారు. నెక్స్ట్ సీఎం రేవంత్ ను మార్చనుందని జోస్యం చెప్పారు.
కృష్ణ నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ కు వారు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ సీపీఐ కీలక నేతలు ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఐకి ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని నేతలు కోరినట్లు తెలుస్తోంది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ నెల 14న పిఠాపురంలో పార్టీ 12వ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. సభలో పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు.
టన్నెల్ లో చిక్కుకున్న ఆ 8 మంది అసలు బతికే అవకాశమే లేదని అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన చేశారు. ఓ వైద్యుడిగా తాను ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. చనిపోయిన వారికి ప్రభుత్వం తరఫున పరిహారం ఇస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికబద్ధంగా రూపొందించారని టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందన్నారు.
టీటీడీలో ఉద్యోగాల భర్తీపై చైర్మన్ బీఆర్ నాయుడు అదిరిపోయే శుభవార్త చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతీ ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.