ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీలో ఇండియా టుడే కాన్ క్లేవ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన రాపిడ్ ఫైర్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి పాల్గొన్నారు లోకేష్. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, బాల కృష్ణలో మీకు ఎవరు ఇష్టమని అడగగా.. ముందుగా ఆల్ ఆఫ్ ది ఎబౌ అంటూ ఆన్సర్ ఇచ్చారు. ఏదో ఒకరి పేరు మాత్రమే చెప్పాలని కోరగా.. తాను మాస్ మహారాజ్ బాలకృష్ణ అభిమాననినని చెప్పారు. ఇష్టమైన బిర్యానీ ఏంటి అని అడగగా ఉలవచారు బిర్యానీ అని అన్నారు. ఏపీలో అరకు వ్యాలీ చూడాల్సిన ప్రదేశం అని చెప్పుకొచ్చారు. తనకు శ్రీశైల పుణ్యక్షేత్రం ఇష్టమన్నారు.
Nara Lokesh and Ram Mohan Naidu face a fun Rapid Fire challenge at India Today Conclave 2025.
— 𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@Shiva4TDP) March 8, 2025
pic.twitter.com/2AzUNo8svh