AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. వయోపరిమితి పెంపుపై కీలక నిర్ణయం!

ఏపీలోని నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త  చెప్పింది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయో పరిమితిని సడలించింది. యూనిఫామ్ సర్వీసెస్ కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కు 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది.

New Update
AP Government Jobs

AP Govt Jobs

ఏపీలోని నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త  చెప్పింది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయో పరిమితిని సడలించింది. యూనిఫామ్ సర్వీసెస్ కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కు 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది. సెప్టెంబర్ 30లోపు జరిగే పరీక్షలకు ఈ సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీపీఎస్సీతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరీక్షలకు సైతం ఈ వయోపరిమితి పెంపు వర్తించనుంది.  

గ్రూప్-2పై కీలక ప్రకటన

ఇదిలా ఉంటే.. ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులు ఈ నెల 10లోగా పోస్టు, జోనల్/జిల్లా ప్రాధాన్యాలను నమోదు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. ఇందుకోసం మంగళవారం నుంచి వెబ్సైట్లో అవకాశం కల్పించినట్లు తెలిపింది. గత నెలాఖరులో గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. హారిజాంటల్ రిజర్వేషన్ అమలుపై సోమవారం జారీ చేసిన ప్రకటనలో ఏపీపీఎస్సీ కార్యదర్శి వివరణ ఇచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్ కేటగిరి కింద కేటాయించిన పోస్టులకు మహిళలు, దివ్యాంగులు, మాజీ సైని కులు, క్రీడాకారుల్లో అర్హులైన అభ్యర్థులు లేకుంటే.. ఆ ఖాళీలను నిబంధనల ప్రకారం మాత్రమే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు