Pastor Praveen Death: రాజమండ్రిలో హైటెన్షన్.. రోడ్డెక్కిన వేలాదిమంది పాస్టర్లు- VIDEO
రాజమండ్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందలాది పాస్టర్లు, క్రైస్తవులు రోడ్డెక్కారు. ప్రవీణ్ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ హైటెన్షన్ వాతావరణం నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
Mumbai Airport: ముంబై ఎయిర్పోర్టులో దారుణం.. చెత్త బుట్టలో శిశువు
ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చెత్త బుట్టలో నవజాత శిశువు కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి వాష్ రూమ్ క్లీన్ చేస్తుండగా సిబ్బందికి చెత్త బుట్టలో శిశువు మృతదేహం లభించింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
TG Politics: మంత్రి కోమటిరెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ.. పార్టీ మార్పుపై కీలక ప్రకటన!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డితో భేటీ కావడం తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. అయితే.. సుధీర్ రెడ్డి పార్టీ మారుతున్నారా? అని కోమటిరెడ్డిని అడగగా.. అది తన పని కాదంటూ బదులిచ్చారు. సుధీర్ రెడ్డి తన బంధువన్నారు.
Nara Lokesh: ఏపీ యువతకు మంత్రి లోకేష్ శుభవార్త.. 20 లక్షల ఉద్యోగాలపై కీలక అప్డేట్!
ఏపీలోని యువతకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మరోసారి ప్రకటించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం ఈ రోజు జరిగింది.
TG Cabinet Expansion: ఢిల్లీ నుంచి ఫోన్.. నాకు హోంశాఖ.. మంత్రి పదవిపై కోమటిరెడ్డి సంచలనం!
తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకం ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. హోంమంత్రి పదవి తనకు ఇష్టమన్నారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని హైకమాండ్ ను కోరారు.
Mallareddy: మల్లారెడ్డికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఘట్కేసర్ లో ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఈ రోజు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిసిన మల్లారెడ్డి ఈ మేరకు వినతి పత్రం అందించగా.. వెంటనే నిధులు మంజూరు చేశారు.