HCU భూమిలో మైహోం అపార్ట్మెంట్.. షాకింగ్ విషయాలు!

BRS అధికారంలో ఉన్న సమయంలో HCU సమీపంలోని సర్వే నం.25లో మై హోం విహంగకు 25 ఎకరాలు కట్టబెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. రెండు భవనాలకే వంద ఫీట్ల రోడ్డు వేశారని ధ్వజమెత్తారు. మై హోం విహంగ విద్యార్థి నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు.

New Update

హైదరాబాద్ మై హోం విహంగ వద్ద ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. HCU పై ఈ రెండు పార్టీలు లేని ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాయని ఆరోపించారు. కంచె గచ్చిబౌలి లోని సర్వే 25లో 2004 లో 534 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నట్టు HCU రిజిస్ట్రార్ సంతకం చేశారన్నారు. ఇందుకు బదులుగా ప్రభుత్వం 397 ఎకరాలు ఇస్తున్నట్లు సంతకం చేశారన్నారు. 534 లో 400 IMG భారత్ కు, 120 ఎకరాలు ఉద్యోగ సంఘాలకు కేటాయించారన్నారు. IMG భారత్ ఒప్పందం ప్రకారం వ్యవహరించలేదన్నారు. ఆ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా ప్రభుత్వం న్యాయ పోరాటం చేసిందన్నారు.
ఇది కూడా చదవండి: HCU Land Issue: హెచ్‌సీయూ వివాదంపై స్పందించిన ప్రకాశ్‌రాజ్

కొట్లాడి సాధించాం..

400 ఎకరాలు ప్రభుత్వ భూమిగా కోర్టుల్లో కోట్లాడి సాధించామన్నారు. ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందాలని కొందరు భావించారన్నారు. ఈ 25 సర్వే నంబర్ లోనే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మై హోం విహంగ కు 25 ఎకరాలు కట్టబెట్టారని ఆరోపించారు. ఇక్కడ పెద్ద భవనాలు నిర్మించారన్నారు. రెండు భవనాలకే వంద ఫీట్ల రోడ్డు వేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూమిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు పేర్లతో 20 ఎకరాలు ఆక్రమించే ప్రయత్న చేశాడని ఆరోపించారు. 

ఆ 20 ఎకరాలు ప్రభుత్వం గుంజుకుంటుందన్న భయంతో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన మై హోం నిర్మాణాల వద్దకు ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పర్యావరణం దెబ్బతింటుందని.. మై హోం విహంగకు 25 ఎకరాలు ఇచ్చినప్పుడు కేటీఆర్ కు కనిపించలేదా? అని ప్రశ్నించారు. లోపాయికారీ ఒప్పందాలు లేకపోతే మై హోం నిర్మాణం చేస్తున్నప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసమే ప్రభుత్వ భూమిని మై హోం కు కట్టబెట్టారన్నారు. 

(HCU Land Dispute | telugu-news | telugu breaking news | latest-telugu-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు