BIG BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం

నాగార్జునసాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లో గన్ మెన్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ట్రాన్స్ ఫార్మర్ కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.

New Update
Kunduru Jayaveer Reddy

Kunduru Jayaveer Reddy

నాగార్జునసాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లో గన్ మెన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ట్రాన్స్ ఫార్మర్ కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఎమ్మెల్యే సిబ్బంది అంతా షాక్ కు గురయ్యారు. ట్రాన్స్ ఫార్మర్ పేలిపోతుందేమోనని భయపడ్డారు. కానీ అలాంటిదేమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కు చెందిన ఇద్దరు సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు