పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయన మృతికి సంబంధించి నిత్యం ఓ కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా కంచికచర్ల సమీపంలోని కీసర టోల్ గేట్ సిబ్బంది ప్రవీణ్ కు సంబంధించి కీలక విషయాలు బయటపెట్టారు. హైదరాబాద్ నుంచి వస్తూ కీసర టోల్‌గేట్ సమీపంలో మధ్యాహ్నం 3.52 గంటలకు ప్రవీణ్ కింద పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పటికే వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి టోల్ గేట్ సిబ్బంది మాట్లాడుతూ.. కీసర కంటే ముందే ప్రవీణ్ కింద పడ్డాడన్నారు.
ఇది కూడా చదవండి:Pastor Praveen wines : వైన్ షాపులో పాస్టర్ ప్రవీణ్...రూ.950 ఫోన్ పే చేసి..
టోల్ ప్లాజా నంబర్ 1033కు ఫోన్ రావడంతో 3 నిమిషాల వ్యవధిలోనే అక్కడికి వెళ్లామన్నారు. అప్పటికే ప్రవీణ్ బైక్ ను పైకి లేపి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నాడన్నారు. ఆయనను ఆపి ఫస్ట్ ఎయిడ్ చేశామన్నారు. ఆయనతో మీరు బండి తోలలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పామన్నారు. తమ టోల్గేట్ విశ్రాంతి గదుల్లో విశ్రాంతి తీసుకోవాలని కోరామన్నారు. కానీ ప్రవీణ్ నిరాకరించాడని చెప్పారు. ఆ సమయంలో బైక్ నడిపే పరిస్థితిలో ప్రవీణ్ లేడన్నారు.
ఇది కూడా చదవండి:Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో ట్రాఫిక్ SI షాకింగ్ విషయాలు
బండి నడిపే పరిస్థితిలో లేరు..
కనీసం బండిని నిలబెట్టే స్థితిలో కూడా లేరన్నారు. తమతో మాట్లాడుతుండగానే 6 సార్లు బండి కిక్ కొట్టేందుకు ప్రయత్నించాడన్నారు. కానీ స్టార్ట్ కాలేదన్నారు. సెల్ఫ్ స్టార్ట్ కావడంతో వెళ్లిపోయాడన్నారు. ప్రథమ చికిత్స చేస్తున్న సమయంలో మాస్క్, హెల్మెట్ తీయాలని కోరినా అందుకు ప్రవీణ్ అంగీకరించలేదన్నారు. ఓకే అని సింబల్ చూపించి వెళ్లిపోయాడన్నారు.
(Pastor Praveen | telugu-news | telugu breaking news)
Follow Us