TG Politics: వివేక్, బాల్క సుమన్ సీక్రెట్ మీటింగ్.. అసలేం జరుగుతోంది?
తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి దాదాపు 30 నిమిషాల పాటు భేటీ కావడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి దాదాపు 30 నిమిషాల పాటు భేటీ కావడం చర్చనీయాంశమైంది.
పట్టపగలే నడిరోడ్డుపై లాయర్‌ను హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. దస్తగిరి అనే ఎలక్ట్రీషియన్ ఓ మహిళను వేధింపులకు గురిచేయడంతో లాయర్ ఇజ్రాయిల్‌ను ఆశ్రయించింది. మహిళ తరఫున ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి లాయర్‌ను చంపాడు.
తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల MLC ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 23న ఎన్నిక ఉంటుంది. కాంగ్రెస్ సపోర్ట్ తో MIM ఈ స్థానాన్ని దక్కించుకునే ఛాన్స్ ఉంది.
ఇండియా కూటమిలో బీఆర్ఎస్ చేరనుందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాతనే కేటీఆర్ చెన్నై వెళ్లాడన్నారు. వంద రోజుల్లో బీఆర్ఎస్ అవినీతిని బయటపెడతానన్న రేవంత్.. ఎందుకు ఆ పని చేయడం లేదన్నారు.
కాళేశ్వరం నీరు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం నుంచి ఎర్రవల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ ముగింపు సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బాలకృష్ణ కంటే కూడా తనతోనే ఎక్కువమంది ఫొటోలు దిగుతారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్ చేశారు. ఆయన రోజుకు ఒకరికి కొడతారట అని అన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో పలు అంశాలపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి పనులు, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయాన్ని చర్చించేందుకే తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. 72 ఏళ్ల వయసులో తాను పార్టీ ఎందుకు మారుతానన్నారు. ఈ సారి ఎంపీగా పోటీ చేస్తానని.. ఎమ్మెల్యేగా మజా వస్తలేదన్నారు.
పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, వరంగల్ బహిరంగ సభ తదితర అంశాలపై చర్చించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. KCRను కలిసిన వారిలో జగదీష్ రెడ్డి, గాదరి కిషోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, సునీతా రెడ్డి ఉన్నారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, మోదీ ఫొటోలతో ఆయన పోస్ట్ చేశారు. ప్రజలే నా బలం అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు.