/rtv/media/media_files/2025/02/23/l7TwI2TwYrCybysnSiMS.jpg)
మహాశివరాత్రి పండక్కి ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఊహించని షాకిచ్చింది. 2025 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28 వరకు 43 శైవక్షేత్రాలకు 3 వేల స్పెషల్ బస్సులను నడుపుతామని వెల్లడించింది. ఏడుపాయలకు తిరిగే ప్రత్యేక బస్సుల్లో మాత్రం 26వ తేదీ నుంచి 28వరకు వర్తిస్తాయని వివరించింది. అయితే వీటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ తెలిపింది. ఇందులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల, కీసరగుట్ట, వేలాల, కాళేశ్వరం, కొమరవెల్లి, అలంపూర్, రామప్పకు ఈ బస్సులు వెళ్తాయని పేర్కొంది. ఇక రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
- మహా శివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు
— PRO, TGSRTC (@PROTGSRTC) February 22, 2025
- శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసులు
- భక్తులకు ఇబ్బందులు కలగకుండా #TGSRTC ఏర్పాట్లు@TGSRTCHQ @Ponnam_INC @TelanganaCMO @revanth_anumula pic.twitter.com/khUbTnSDrA
శ్రీశైలంకు 800 స్పెషల్ బస్సులు
ఇందులో ప్రధానంగా శ్రీశైలంకు 800, ఏడుపాయలకు 444, వేములవాడకు 714, కాళేశ్వరానికి 80, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కొమురవెల్లికి 51 బస్సులతో పాటు పాలకుర్తి, అలంపూర్, ఉమామహేశ్వరం, రామప్ప తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపనుంది. ప్రయాణికులకు సులభంగా అర్థం అయ్యేందుకు స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, కేపీహెచ్‌బీ, ఐఎస్ సదన్, కాలనీ, బీహెచ్‌ఈఎల్ ప్రాంతాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు బయల్దేరతాయి. హైదరాబాద్ నుంచి వేములవాడ, శ్రీశైలం బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయానికి 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ తెలిపింది.
Also Read : IND vs PAK : ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. పాక్ ఓడితే ఇంటికే.. మరి భారత్ ఓడితే?