Telangana Municipal Elections 2026: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కొన్ని రోజులుగా ఊరూవాడలా మారుమోగిన మైకులు, పార్టీల జెండాలు, అభ్యర్థుల ఇంటింటి ప్రచారానికి నేటితో తెరపడింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కొన్ని రోజులుగా ఊరూవాడలా మారుమోగిన మైకులు, పార్టీల జెండాలు, అభ్యర్థుల ఇంటింటి ప్రచారానికి నేటితో తెరపడింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీలు యువతకు పెద్దపీట వేశాయి. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి పలువురు యువకులు ఆసక్తి చూపడంతో పలువురు 35 ఏళ్లలోపువారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 11న ఓటింగ్, 13న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో ఎక్కువమంది కోటిశ్వరులు ఉండటం చర్చనీయంశంగా మారింది. చైర్మన్, మేయర్ స్థానాలే లక్ష్యంగా వారు రంగంలోకి దిగారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 11న జరగనున్న ఏడు నగర పాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికల్లో మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోటీదారుల్లో 6,508 మంది (50.27శాతం) మహిళలు ఉండగా, 6,436 (49.73 శాతం) మంది పురుషులున్నారు.
రాఫ్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు ధీటుగా ఈ ఎన్నికల్లో సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఈసారి బీజేపీ ఎన్నికల ప్రచారంలో దింపనుంది.
మున్సిపాల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ వేళ అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టికెట్ రాని వారి అలకలు, నాయకుల బుజ్జగింపులు, తిరుగుబాట్లతో అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గందరగోళం నెలకొంది. ఉపసంహరణల తర్వాత 12,993 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో సీపీఐ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. ఈ మేరకు బీఆర్ఎస్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, సీపీఐ నాయకుల మధ్య సయోధ్య కుదిరింది
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కాగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నగదు రవాణాపై కఠిన నియమాలను అమలు చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నగారా మోగింది. సింగిల్ ఫేజ్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. తక్షణం రాష్ట్రవ్యాప్తంగా (జీహెచ్ఎంసీ పరిధి మినహా) ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.