Tamilisai Soundararajan: ప్రధాని అభ్యర్థి ఎవరు?.. కాంగ్రెస్‌పై తమిళిసై సెటైర్లు
TG: బీజేపీలో ప్రధాని అభ్యర్థి మోడీ.. మరి కాంగ్రెస్‌లో ప్రధాని అభ్యర్థి ఎవరు? అని ప్రశ్నించారు తమిళిసై. రాహుల్ రిజర్వేషన్ల మీద అసత్యపు ప్రచారం చేసి కులమతాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయన్నారు.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా రూ.155 కోట్లు సీజ్
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.155 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.61.11 కోట్ల నగదు, రూ.19.16 కోట్ల నగలు, రూ. 28.92 కోట్ల మద్యం, రూ.23.87 కోట్ల డ్రగ్స్, రూ.22.77 కోట్ల విలువైన వస్తువులు సీజ్ చేశామన్నారు.
Sangareddy Accident: పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరి మృతి
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మన్సాన్పల్లి శివారులో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జోగిపేట ప్రభుత్వాస్పత్రికి క్షతగాత్రుల తరలించారు.
KA Paul: ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబూమోహన్
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రజాశాంతి పార్టీలో చేరిన మాజీ మంత్రి బాబూమోహన్ కు కీలక పదవీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబూమోహన్ ను నియమించారు.
Ex DSP Praneeth Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో పోలీస్ అధికారులు గుర్తించారు.
CP Radhakrishnan: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్
TG: హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని కుటుంబ సభ్యులతో వెళ్లి దర్శించుకున్నారు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్. అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. గవర్నర్ వెంట సీఎస్ శాంతికుమారి వెళ్లారు.
MLA KTR: ముందు క్షమాపణ చెప్పు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేటీఆర్. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని అన్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ను ఉచితంగా ఇస్తామని ఇచ్చిన మాటను తప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు.
CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం త్వరలోనే వైబ్రంట్ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్ ప్రకటించబోతున్నట్టు తెలిపారు. మొత్తం తెలంగాణను మూడు విభాగాలుగా సమాన అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Tamilisai-Soundararajan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Money-Seized-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Sangareddy-Accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/KA-Paul--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-15-at-12.44.43-AM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CP-Radhakrishnan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/revanth-ktr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/CM-REVANTH-REDDY-6-jpg.webp)