KA Paul: ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబూమోహన్‌

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రజాశాంతి పార్టీలో చేరిన మాజీ మంత్రి బాబూమోహన్‌ కు కీలక పదవీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబూమోహన్‌ ను నియమించారు.

New Update
KA Paul: ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబూమోహన్‌

KA Paul : ప్రజాశాంతి పార్టీ(Praja Shanti Party) అధినేత కేఏ పాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రజాశాంతి పార్టీలో చేరిన మాజీ మంత్రి బాబూమోహన్‌(Ex. Minister Babu Mohan) కు కీలక పదవీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ(Telangana) అధ్యక్షుడిగా బాబూమోహన్‌ను నియమించారు. రానున్న లోక్ సభ ఎన్నిక (Lok Sabha Elections) ల్లో తెలంగాణలో ప్రజాశాంతి పోటీ చేస్తుందని కేఏ పాల్ తెలిపారు. తాను ఈసారి తెలంగాణలో పోటీ చేయట్లేదని తెలిపారు. ప్రజాశాంతి పార్టీ తొలి ఎంపీ అభ్యర్థిగా బాబూమోహన్ ను ప్రకటించారు కేఏ పాల్. కాగా వరంగల్ (Warangal) నుంచి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బాబుమోహన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండనున్నారు. కాగా బాబు మోహన్ ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరి ఎవరి ఊహకు అందని ట్విస్ట్ ఇచ్చారు.

ALSO READ : అందరిని గుర్తుపెట్టుకుంటాం.. వైసీపీ నేతలకు లోకేష్ హెచ్చరికలు

విశాఖ ఎంపీ రేసులో కేఏ పాల్..

ఏపీలో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి నడుమ పోటీ గట్టిగ ఉండనుందని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగగా.. లేదు నేను కూడా ఉన్నాను అంటూ ఏపీ రాజకీయాల తెరపైకి వచ్చారు కేఏ పాల్. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తాను విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు.

తనను ఎంపీగా గెలిపిస్తే ఏపీకి విదేశాల నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. చంద్రబాబు, జగన్ చేరి ఐదేళ్ళు ఏపీకి పాలించి అప్పుల కుప్పగా.. రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని ఫైర్ అయ్యారు. 'ఏపీలో పాల్ రావాలి.. పాలన మారాలని' అని స్లోగన్ ఇచ్చారు. పాల్ వస్తే అభివృద్ధి దిశగా ఏపీ అడుగులు వేస్తోందని అన్నారు.

తెలంగాణకు దూరంగా ఉన్నారు..

తెలంగాణ ఎన్నికల్లో హాల్ చల్ చేసే కేఏ పాల్.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దూరంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేసిన కేఏ పాల్ కు డిపాజిట్ దక్కలేదు. ఎన్నికల్లో ఓటమి చెందినా.. ప్రచారాల్లో మాత్రం దూసుకెళ్లి అందరిని ఆకర్షించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేఏ పాల్ లేకపోవడం ఆయన అభిమానులను కాస్త నిరాశ పరిచింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు