ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. నేడే కేటీఆర్‌ను అరెస్టు చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. తెలంగాణ భవన్ వద్ద నిన్న మధ్యాహ్నం నుంచి భారీగా పోలీసులు మోహరిస్తుండడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం భారీగా తెలంగాణ భవన్ కు తరలివస్తున్నారు. మరో వైపు ఈ కేసు విషయంలో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. నిన్నటి నుంచి ఆయన న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ రోజు ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: Supreme Court: చట్టాలున్నది మొగుళ్లను బెదిరించడానికి కాదు తెలంగాణ భవన్ వద్ద పోలీసుల మోహరింపు pic.twitter.com/YhCPSimwvh — Sarita Avula (@SaritaAvula) December 20, 2024 కేసు ఎందుకో అర్థం కావడం లేదు.. ఇక ఏసీబీ కేసు ఎందుకు పెడుతున్నారో తనకు అర్థం కావట్లేదని కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు.. ఏసీబీ రావడానికి అక్కడ కరెప్షన్ ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. రేవంత్ ప్రభుత్వం కుట్రతోనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. డబ్బులు రేస్ నిర్వాహకులకు ముట్టాయన్నారు. కాంగ్రెస్ వల్లే రేస్ తిరిగి వెళ్లిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి ఇండియా ఇజ్జత్ తీశాడని ధ్వజమెత్తారు. ఇది కూడా చదవండి: అసలు ఫార్ములా-ఈ రేసు కేసు ఏంటి? KTR చేసిన మిస్టేక్ అదేనా? తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్.. కేటీఆర్ అరెస్ట్ కు సిద్దమైన అధికారులు.!@KTRBRS @revanth_anumula #KTR #Arrest #TelanganaBhavan #HighTension #RevanthReddy #Congress #ACB #FIR #Rtvnews #RTV pic.twitter.com/L7S52oR0d6 — RTV (@RTVnewsnetwork) December 19, 2024 మా వెంట్రుక కూడా పీకలేడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువన్నారు. ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ చేస్తామంటే చేసుకో.. అంటూ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తమ వెంట ఎందుకు పడుతున్నాడో తెలుసన్నారు. మీ సీక్రెట్స్ బయటపెట్టినందుకే ఇలా చేస్తున్నావని తెలుసన్నారు కేటీఆర్.