/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
KTR
KTR : తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఈ రోజు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీల్లో 2500 పైగా స్థానాలను గెలుచుకోగలుగుతున్నామన్నారు. మా వాళ్లు చాలాచోట్ల వీరోచిత పోరాటం చేశారని ఆయన అన్నారు.చౌటుప్పల్, గద్వాలలో అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమంగా గెలిచారని ఆయన ఆరోపించారు. గద్వాలో నాలుగుసార్లు రీకౌంటింగ్ చేసి ఒక్క ఓటుతో గెలిచామని చెప్పుకున్నారన్నారు. గతంలో 122 మున్సిపాలిటీల్లో విజయం సాధించామన్నారు. కాంగ్రెస్, బీజేపీని నిలువరించే పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. పలుచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులను ఎత్తుకెళ్లారని ఆరోపించారు. రాష్ర్టంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నే అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే ఊపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తాని తెలిపారు.
15 చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించనున్నామన్నారు. కొత్తగూడెంలో సీపీఐ అధిక్యంలో ఉందని, వారికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లు కలిసి పనిచేశాయని కేటీఆర్ ఆరోపించారు. ప్రతిపక్షపార్టీగా గణనీయమైన విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ పనితీరును ప్రజలు వ్యతిరేకించారని ఆయన తెలిపారు.
Follow Us