Tata Nano EV Car: రచ్చ రచ్చే.. 2025 టాటా నానో ఈవీ రెడీ.. సింగిల్ ఛార్జింగ్‌తో 200 కి.మీ రయ్ రయ్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ త్వరలో మరో మోడల్‌ను పరిచయం చేయనుంది. టాటా నానో ఈవీ 2025 కార్‌ను భారత్‌లో లాంచ్ చేయనుంది. దీని ధర రూ.6లక్షల నుంచి రూ.9లక్షల మధ్య ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 200కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని సమాచారం.