Spy Satellite: చైనా-పాకిస్తాన్ ల పై టాటా గూఢచారి..మస్క్ స్పేస్ ఎక్స్ నుంచి అంతరిక్షానికి.. ఆకాశం నుంచి పాకిస్తాన్-చైనాలపై కన్నేసి ఉంచే గూఢచారి ఉపగ్రహాన్నిTASL సిద్ధం చేసింది. ఈ ఉపగ్రహం అమెరికాలోని మస్క్ స్పేస్ ఎక్స్ సెంటర్ నుంచి అంతరిక్షానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని గ్రౌండ్ స్టేషన్ బెంగళూరులో ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి. By KVD Varma 19 Feb 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Spy Satellite: కొన్ని విషయాలు వినడానికి భలే ఉంటాయి. వినగానే మనలో ఒకరకమైన వైబ్రేషన్ వస్తుంది. అలంటి విషయమే ఇది. మన టాటా గ్రూప్ ఒక గూఢచారిని సిద్ధం చేసింది. ఈ గూఢచారి శాటిలైట్. చైనా, పాకిస్తాన్ పై అంతరిక్షం నుంచి ఓ కన్నేసి ఉంచడం కోసం టాటా దీనిని సిద్ధం చేసింది. దీనిని అమెరికా లోని ఎలాన్ మాస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ నుంచి అంతరిక్షానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకీ ఇందులో మరో కిక్ ఇచ్చే విషయం ఏమిటంటే.. ఇలాంటి గూఢచారి ప్రపంచంలోనే మొదటిది. అదీ భారత్ లో తయారైంది. ఇది వింటే మీకు కూడా వైబ్రేషన్స్ వచ్చాయి కదా. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏమిటీ ఈ ఉపగ్రహం.. మిలిటరీ గ్రేడ్ కింద ఈ ఉపగ్రహాన్ని(Spy Satellite) టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (TASL) సిద్ధం చేసింది. ఈ ఉపగ్రహం చైనా, పాకిస్తాన్ మిలటరీ కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచుతుంది. ఎప్పటికప్పుడు వివరాలను మిలటరీకి చేరవేస్తుంది. మన సాయుధ దళాల కోసం నిఘా వ్యవస్థను అందిస్తుంది. ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఇది ఏప్రిల్ లో లాంచ్ అవ్వవచ్చు. మీడియా నివేదికలలో అందిన సమాచారం ప్రకారం, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (TASL) రూపొందించిన ఉపగ్రహం(Spy Satellite) గత వారం పూర్తయింది. ఏప్రిల్లో లాంచింగ్ కోసం ఫ్లోరిడాకు పంపిస్తారు. TASL ప్రోగ్రామ్ ప్రత్యేక అంశం ఏమిటంటే, లాంచింగ్ ఒక్కటే అమెరికా నుంచి జరుగుతుంది. దాని భూ నియంత్రణ అంటే గ్రౌండ్ స్టేషన్ దానికి సంబంధించిన విషయాలు అన్నీ భారతదేశంలోనే ఉంటుంది, ఇది సాయుధ దళాల ద్వారా నిఘా కోసం అవసరమైన కోఆర్డినేట్ల సీక్రేసీని కాపాడుతుంది. Also Read: గూడ్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. కేవలం అందుకోసమే.. దీని స్పెషాలిటీస్ ఇవే! భారత్ లో ఈ ఉపగ్రహ గ్రౌండ్ స్టేషన్ (Spy Satellite)కోసం పనులు మొదలయ్యాయి. బెంగళూరులో దీని గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నియంత్రణ కేంద్రం ఉపగ్రహం మార్గం అలాగే దాని నుంచి వచ్చే చిత్రాల ప్రాసెసింగ్ నిర్వహిస్తుంది. వీటిని సాయుధ దళాలు మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడానికి - సైనిక లక్ష్యాలను సాధించడానికి ఉపయోగించుకుంటాయి. ఈ ఉపగ్రహం 0.5 మీటర్ల స్పేషియల్ రిజల్యూషన్ ఇమేజరీని అందించే లాటిన్ అమెరికన్ కంపెనీ శాటెలోలిక్తో భాగస్వామ్యం కూడా కలిగి ఉంది. ISRO వద్ద సబ్-మీటర్ రిజల్యూషన్ ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే సరిహద్దు వెంబడి శత్రువుల కదలికలను పర్యవేక్షించడానికి(Spy Satellite) అవసరమైన కవరేజీని బట్టి, సాయుధ దళాలు గతంలో అత్యవసరంగా అవసరమైన గూఢచారాన్ని సంపాదించడానికి US కంపెనీలను ఎంచుకున్నాయి. చైనాతో LACపై జరిగిన పరిణామాల తర్వాత, విదేశీ సంస్థల నుండి చిత్రాలను కొనుగోలు చేయడం పెరిగింది. దాని ప్రాథమిక రక్షణ పాత్రతో పాటు, ఉపగ్రహ చిత్రాలను కూడా స్నేహపూర్వక దేశాలకు ఎగుమతి చేయవచ్చు. Watch this Interesting Video: #elon-musk #spacex #tata మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి