Tata Nano EV Car: రచ్చ రచ్చే.. 2025 టాటా నానో ఈవీ రెడీ.. సింగిల్ ఛార్జింగ్‌తో 200 కి.మీ రయ్ రయ్!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ త్వరలో మరో మోడల్‌ను పరిచయం చేయనుంది. టాటా నానో ఈవీ 2025 కార్‌ను భారత్‌లో లాంచ్ చేయనుంది. దీని ధర రూ.6లక్షల నుంచి రూ.9లక్షల మధ్య ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 200కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని సమాచారం.

New Update
Tata Nano EV Car

Tata Nano EV Car

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్‌కు భారత మార్కెట్‌లో అదిరిపోయే క్రేజ్ ఉంది. ఈ కంపెనీ నుంచి ప్రతి మోడల్ వాహన ప్రియుల్ని అట్రాక్ట్ చేశాయి. ఇప్పుడు మరో మోడల్‌ను కంపెనీ పరిచయం చేసేందుకు సిద్ధమైంది. త్వరలో భారత మార్కెట్‌లో టాటా మోటార్స్.. Tata Nano EV Carను లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన లుక్ హైక్లాస్‌గా ఉండటంతో వాహనప్రియులు ఫిదా అయిపోయారు. ఈ టాటా నానో ఈవీ.. చిన్న కార్ల విభాగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, ఫీచర్లు, మైలేజ్ గురించి పూర్తి గా తెలుసుకుందాం. 

Also Read: యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన

Tata Nano EV Price

Tata Nano EV మోడల్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే భారతీయ మార్కెట్లో అత్యంత చౌకైన EVలలో ఒకటిగా Tata Nano EV నిలుస్తుంది. దీంతో అతి తక్కువ ధరలో అద్బుతమైన ఎలక్ట్రిక్ కార్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్న ప్రియులకు ఇది బెస్ట్‌గా నిలవనుంది. 

Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Tata Nano EV Range

Tata Nano EV ఒక్క ధరలోనే కాకుండా మైలేజ్‌లోనూ తోపుగా నిలవనుంది. ఇది అతి తక్కువ ధరలో రావడమే కాకుండా ఊహించనంత మైలేజీని అందిస్తుంది. టాటా నానో ఈవీ సింగిల్ ఛార్జింగ్‌పై దాదాపు 200 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ అందించనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

Tata Nano EV Features

Tata Nano EV కార్‌లో అధునాతన ఫీచర్లు అందించినట్లు తెలుస్తోంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. అలాగే దీనితో పాటు సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 4 పవర్ విండోస్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్‌ను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఈవీ కారు మరో బడ్జెట్ ఈవీతో పోటీ పడాలంటే ఇందులో మరెన్నో ఫీచర్లు ఉండాలి. ముఖ్యంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, బ్యాక్ పార్కింగ్ సెన్సార్‌, EBDతో ABS సహా మరెన్నో ఫీచర్లు ఉండాలి. 

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

ఇదిలా ఉంటే Tata Nano EV లాంచ్ గురించి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ బట్టి అతి త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

(latest-telugu-news | new-cars | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు