/rtv/media/media_files/2026/01/20/governor-r-n-ravi-walks-out-of-tamil-nadu-assembly-2026-01-20-12-18-56.jpg)
Governor R N Ravi walks out of Tamil Nadu Assembly
Governor Walkout: తమిళనాడు అసెంబ్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor R N Ravi) అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం కలకలం రేపింది. తాను నిరత్సాహానికి గురయ్యానని రవి తెలిపారు. జాతీయ గీతానికి సరైన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. శాసనసభలో ప్రసంగం మాత్రమే చేసి వెళ్లాలని స్పీకర్ ఎం అప్పవు గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. తన ప్రసంగాన్ని అడ్డుకోవడం దురదృష్టకరమని గవర్నర్ రవి అసహనం వ్యక్తం చేశారు.
Tamil Nadu Governor R.N. Ravi walks out of House as Chief Minister M.K. Stalin objects to deviation from speech#TNgovernor#TamilNadu#TVKVijay#Noneedgovernor#stateautonomypic.twitter.com/Wv18fqoPrD
— Syed Razak TVK🇪🇸 (@TVKSyed) January 20, 2026
Also Read: ఆఫీసులో రాసలీలు.. కర్ణాటక డీజీపీ సస్పెండ్
జాతీయ గీతానికి కూడా సరైన గౌరవం దక్కలేదని ఆరోపించారు. సభలో ఎమ్మెల్యేలకు మాత్రమే తమ అభిప్రాయాలు తెలియజేసే అనుమతి ఉంటుందని వేరేవాళ్లకి ఛాన్స్ లేదని స్పీకర్ అన్నారు. మరోవైపు తన మైక్ స్విఛాప్ చేసి అవమానించారని రవి వాపోయారు. కనీసం తన ప్రసంగాన్ని కూడా పూర్తిగా చదవలేకపోయానని అన్నారు. అందులో కూడా తప్పులే ఉన్నట్లు చెప్పారు.
Also Read: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణస్వీకారం
గవర్నర్ మైక్‌ను పదేపదే ఆఫ్ చేశారంటూ లోక్‌భవన్ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో చాలా తప్పులు ఉన్నాయని, అసలు సంబంధం లేని విషయాలు ఉన్నాయని ఆరోపించింది. రాష్ట్రంలో రూ.12 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించినట్లు చెప్పిన విషయంలో వాస్తవం లేదన్నారు. దళితులపై దాడులు, దళిత మహిళలపై లైంగిక వేధింపు ఘటనలు పెరిగినప్పటికీ వాటి గురించి ప్రస్తావించలేదంటూ విమర్శించింది.
Follow Us