NEET: నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన మరో రాష్ట్రం..
నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా.. తాజాగా పశ్చిమ బెంగాల్ కూడా అలాంటి చర్యలు చేపట్టింది. నీట్ పరీక్షను రద్దు చేసి గతంలో ఉన్న పద్ధతినే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.