/rtv/media/media_files/2025/03/02/DlGhyPEwgw21toC47Q1C.jpg)
Four electrocuted during church festival in Kanyakumari
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఓ చర్చిలో ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. కరెంట్ షాక్‌తో నలుగురు యువకులు మృతి చెందడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కన్యాకుమారి జిల్లా ఎనాయం పుతేంతురైలో సెయింట్ ఆంథోనీ చర్చి పండుగను ప్రతి సంవత్సరం భక్తులు ఘనంగా జరుపుతుంటారు. ఎప్పట్లాగే ఈసారి కూడా కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని అనుకున్నారు.
Also Read: ఇంత స్పీడున్నారేంట్రా బాబు- నాలుగు నిమిషాల్లో ATM లూటీ.. లక్షల్లో దోచేసి..!
ఈ క్రమంలోనే ఏర్పాట్లు మొదలుపెట్టారు. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తయారుచేసిన రథంపై ఏసుక్రీస్తును ఊరేగిస్తుంటారు. ఇందులో భాగంగానే జీసస్ అనుచరులు, స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం రథానికి సుందరీకరణ పనులు చేయడం కోసం కొంతమంది యువకులు రెడీ అయ్యారు. అయితే పనుల్లో భాగంగా ఇనుప నిచ్చెనను తీసుకెళ్తుండగా.. అది హైవోల్టేజీతో ఉన్న వైర్లకు తగలింది. దీంతో నలుగురు యువకులు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మరణించారు.
Also Read: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
కరెంట్ షాక్ ప్రభావానికి మంటల్లో కాలుతూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వారిని మరియా విజయన్, బి శోభన్, మైఖేల్ పింటో, ఆంటోనీగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. చర్చిలో ఉత్సవాలు జరగనున్న వేళ.. నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని 37 మంది మృతి