Supreme Court: బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ చాలామంది ప్రజలు పండుగ వేళ టపాసులు కాల్చేశారు. దీంతో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏ మతమూ కూడా కాలుష్యాన్ని ప్రోత్సహించదని పేర్కొంది. ఇలాంటి చర్యలను అరికట్టాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది.