Shivaratri: శ్రీకాళహస్తిలో అర్థరాత్రి అఘోరా క్షుద్ర పూజలు!

శ్రీకాలహస్తిలో అఘోర క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శివరాత్రి రోజే అర్థరాత్రి భక్త కన్నప్ప ఆలయంలో లిందోగ్భావం సమయంలో క్షుద్ర పూజలు తలపించేలా మంత్రాలు చదవడంతో జాగారానికి వచ్చిన భక్తులు భయాందోళన గురైయ్యారు. అతను తమిళనాడు నుంచి వచ్చినట్లు చెప్పాడు.

New Update
srikalahasthi aghora

srikalahasthi aghora Photograph: (srikalahasthi aghora)

శివరాత్రి రోజు అర్థరాత్రి ఆయలంలో అఘోరా క్షుద్ర పూజల కలకలం రేపాయి. శ్రీకాళహస్తిలోని భక్తకన్నప్ప దేవాలయంలో ఓ అఘోరా హల్ ఛల్ చేశాడు. లిందోగ్భావం సమయంలో ఆలయం పరిసరాల్లో క్షుద్ర పూజలు తలపించేలా మంత్రాలు చదవడంతో గ్రామస్తులు, ఆలయ సిబ్బంది భయాందోళన చెందారు. శివరాత్రి పర్వదినం కావడంతో భక్తులు జాగారం చేయడానికి అధిక సంఖ్యలో భక్త కన్నప్ప ఆలయానికి వచ్చారు. వారు అఘోరా విఛిత్ర పూజలతో భయభ్రాంతులకు గురయ్యారు.

Also read : Detox Drinks: శరీరాన్ని శుభ్రపరిచే మూడు డీటాక్స్‌ డ్రింక్‌లు

శ్రీకాళహస్తి ఆలయ సిబ్బంది సెక్యూరిటీ ఎవరు కూడా ఆ అఘోరాను ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు. అక్కడ ఉన్న భక్తులే అఘోరాని ప్రశ్నించారు. ఎక్కడ నుంచి వచ్చావు? ఎవరు నీవు? ఏ పూజలు నిర్వహిస్తున్నావని భక్తులు అఘోరాని అడిగారు. అతను తమిళనాడు నుంచి వచ్చానని అఘోరా భక్తులకు చెప్పాడు. భక్తులు అడిగిన ప్రశ్నలకు అఘోరా పొంతనలేని సమాధానం ఇచ్చాడు. అర్ధరాత్రి ఇలాంటి పూజ నిర్వహించడంతో భక్తులు అయోమయంలో పడిపోయారు.

Also read : SpaceX launched IM-2: చంద్రుడిపైకి మానవ మనుగడ.. స్పేస్X మిషన్‌లో కీలక పరిణామం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు