AP: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై హత్యాయత్నం
తనపై హత్యాయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ఓటమి భయంతో తనను మట్టుపెట్టడానికి చూస్తున్నాడని ఆరోపించారు. కత్తి పట్టుకొని వచ్చిన వైసీపీ వ్యక్తిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించామన్నారు.