Bangladesh: ప్రభుత్వాన్ని కూల్చేసిన 26ఏళ్ళ కుర్రాడు
ఓ కుర్రాడు...కేవలం26 ఏళ్ళు. అతను మొదలెట్టిన పోరాటం బంగ్లాదేశ్ ప్రధాని పదవికే ఎసరు పెట్టింది. చిన్న ఆందోళనగా మొదలైన రిజర్వేషన్ల ఉద్యమం ఏకంగా ప్రధాని హసీనా భవితవ్యాన్ని అంధకారం చేసింది.
ఓ కుర్రాడు...కేవలం26 ఏళ్ళు. అతను మొదలెట్టిన పోరాటం బంగ్లాదేశ్ ప్రధాని పదవికే ఎసరు పెట్టింది. చిన్న ఆందోళనగా మొదలైన రిజర్వేషన్ల ఉద్యమం ఏకంగా ప్రధాని హసీనా భవితవ్యాన్ని అంధకారం చేసింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరికొంతకాలం భారత్‌లోనే ఉండనున్నారు. యూకేలో ఉండడానికి పర్మిషన్ రాని కారణంగా ఆమె ఇక్కడే ఉంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జాతీయ భద్రతా మండలి చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
షేక్ హసీనా నమ్మిన బంటే తనను వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జమాన్ ప్రణాళిక బద్ధంగానే హసీనాపై కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టినట్లు రాజకీయ విశ్లేషకుల్లో చర్చ నడుస్తోంది. మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి విడుదల నిర్ణయం దీనికి మరింత బలాన్నిస్తుంది.
బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో భారత్‌లో తల దాచుకున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు తాము ఆశ్రయం ఇవ్వలేమని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం ఆమెకు ఆశ్రయం కల్పించడం కష్టతరమైన విషయంగా పేర్కొన్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
బంగ్లాదేశ్ పార్లమెంట్ ను ప్రెసిడెంట్ రద్దు చేశారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని ఖలీదా జియా కొత్త ప్రభుత్వానికి నేతృత్వం వహించే అవకాశం ఉందని సమాచారం.
బంగ్లాదేశ్ లో తిరుగుబాటు తెలిసిందే. దీంతో ప్రధాని షేక్ హసీనా అక్కడ నుంచి భారత్ వచ్చారు. ఆమె భారత్ రావడం వెనుక ప్రభుత్వ సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కనుక అక్కడే ఉంటే ప్రాణాపాయం కలిగి ఉండేది. ఆమె అక్కడి నుంచి వెళ్లిన వెంటనే ప్రజలు ఆమె బంగ్లాలో విధ్వంసం సృష్టించారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని ఆర్మీ తమ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్ళిపోయిన షేక్ హసీనా ఇక రాజకీయాల్లోకి తిరిగి రారని చెప్పారు ఆమె తనయుడు సాజీబ్ వాజెద్ జాయ్.
బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ భేటీ నిర్వహించారు. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతపై ఆరా తీశారు. ప్రస్తుతం షేక్ హసీనా ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఉన్నారు. ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కలిశారు.
బంగ్లాదేశ్‌లో ప్రధాని ఇంట్లో చొరబడ్డ ఆందోళనకారులు.. ఫుడ్ ఐటెమ్స్, ల్యాప్టాప్స్, వంటపాత్రలను ఎత్తుకెళ్తున్నారు. మరికొందరు ఫర్నీచర్, టీవీ, వాహనాలను ధ్వంసం చేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి.. ఢిల్లీకి చేరుకున్న హసీనా లండన్ పారిపోనున్నట్లు తెలుస్తోంది.