Bangladesh Ex Prime Minister: రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. నిరసనకారులు తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టేందుకు రావడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం నేరుగా కుటుంబంతో కలిసి ఇండియాకు వచ్చారు. అయితే ఇక్కడ నుంచి ఆమె లండ్ వెళ్ళాలని ప్లాన్. కానీ అందుకు బ్రిటన్ గవర్నమెంట్ అంగీకరించలేదు. హసీనాకు తాము ఆశ్రయం ఇవ్వలేమంటూ సూచించినట్లు సమాచారం. ఈ మేరకు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి ఆశ్రయం కల్పించడం కష్టతరమైన విషయంగా పేర్కొన్నట్లు అక్కడి జాతీయమీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పూర్తిగా చదవండి..Sheikh Hasina:మరికొంత కాలం భారత్ లోనే షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరికొంతకాలం భారత్లోనే ఉండనున్నారు. యూకేలో ఉండడానికి పర్మిషన్ రాని కారణంగా ఆమె ఇక్కడే ఉంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జాతీయ భద్రతా మండలి చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
Translate this News: