Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత కలకలం..!
శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత కలకలం సృష్టించింది. చిరుత ఎయిర్‌పోర్టు ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు తగలడంతో కంట్రోల్ రూమ్‌లోని అలారం మోగినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరుతతోపాటు రెండు పిల్లల్లు ఉన్నట్లు సమాచారం.