/rtv/media/media_files/2026/02/11/fotojet-11-2026-02-11-15-43-49.jpg)
Jagga Reddy
Jagga Reddy : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భారీ షాక్ తగిలింది. ఆయన బూతు పురాణంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. పోలింగ్ బూత్ వద్ద ఆయన చేసిన హంగామాపై స్పందించింది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి, సంబంధిత రిపోర్ట్ ఈసీకి ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీకి ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఇది సరికాదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు సంగారెడ్డిలో జగ్జారెడ్డి నానా హంగామా చేశాడు. పట్టణంలోని 34వ వార్డు ఇందిరా కాలనీలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సీసీఎస్ సీఐ శివకుమార్ కు, స్థానిక కాంగ్రెస్ నేతలకు మధ్య పరస్పరం వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీఐ కాంగ్రెస్ నేత కాలర్ పట్టుకున్నారని వివాదం మరింత ముదిరింది. ఈ విషయం తెలిసిన జగ్గారెడ్డి ఆవేశంతో అక్కడికి చేరుకుని పోలీసులపై విరుచుకుపడ్డారు. తన కార్యకర్తనే ఆపుతారా అంటూ బూతు పురాణం అందుకున్నారు. అవసరమైతే ఎన్నికలను ఆపేస్తా అంటూ రెచ్చిపోయారు. సీఐ శివకుమార్, హోంగార్డు చెన్నయ్యపై బూతులతో రాయలేని భాషలో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించిందిజ. జగ్గారెడ్డి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కేసు నమోదు చేసి రిపోర్టు చేయాలని స్థానిక ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది.
Follow Us