రష్యాలో ఉద్రిక్తత.. మాస్కోపై 34 డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్..
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ దాడులకు పాల్పడింది. మొత్తం 34 డ్రోన్లతో విరుచుకుపడింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఈ స్థాయిలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడం ఇదే మొదటిసారి.