Donald Trump: పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. !
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇతర దేశాల అధినేతలకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఫోన్ చేసి మాట్లాడారు.
రష్యాలో ఉద్రిక్తత.. మాస్కోపై 34 డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్..
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ దాడులకు పాల్పడింది. మొత్తం 34 డ్రోన్లతో విరుచుకుపడింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఈ స్థాయిలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడం ఇదే మొదటిసారి.
ఉక్రెయిన్‌పై ఒకే నెలలో 2 వేల డ్రోన్ల దాడి.. రష్యా సంచలన ప్రకటన
రెండేళ్ల క్రితం మొదలైన రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ నెలలో ఉక్రెయిన్‌పై 2 వేల డ్రోన్లతో దాడి చేశామని రష్యా తెలిపింది. 20 సార్లు రష్యా డ్రోన్ దాడులు చేసినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు కూడా పేర్కొన్నాయి.
Russia-Ukraine War: పుతిన్ సంచలన ప్రకటన.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధం!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు మాస్కో-కీవ్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించగలవని పుతిన్ చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి.
PM Modi: రష్యా, ఉక్రెయిన్‌తో చర్చలు.. ప్రధాని మోదీ శాంతి సందేశం
ఇటీవల రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని మోదీ జరిపిన చర్చలు.. ప్రపంచ వేదికపై భారత్‌ను ఓ కీలక ప్లేయర్‌గా నిలిపాయి.అలాగే ఇరు దేశాలతో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలతో పాటు.. శాంతి స్థాపకుడిగా ప్రధాని మోదీ సామర్థ్యంపై ఆశలు చిగురించాయి.
Russia-Ukraine : రష్యాపై డ్రోన్ దాడి.. 38 అంతస్తుల భవనంపై..
రష్యాలోని 38 అంతస్తుల ఎత్తైన భవనం పై ఉక్రెయిన్ డ్రోన్ తో దాడి చేసింది. ఈ ఘటన సరతోవ్ నగరంలోని ఎత్తైన 38 అంతస్తుల వోల్గా స్కైలో జరిగింది. డ్రోన్ భవనాన్ని ఢీకొట్టడంతో.. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారి పరిస్థితి విషమంగా ఉంది.
Russia vs Ukraine: రష్యాలోకి చొచ్చుకు పోతున్న ఉక్రెయిన్ సైన్యం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రమవుతోంది. ఉక్రెయిన్ సైన్యం రష్యాలోకి 35 కిలోమీటర్ల దూరం చొచ్చుకుపోయాయి. రష్యాలోని సుడ్జా నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. గత పదిరోజుల్లో 82 రష్యా గ్రామాలను ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది
/rtv/media/media_files/2024/11/19/uCCYhUOVDpq2yM06M7P7.jpg)
/rtv/media/media_files/2024/11/11/iES8slBuSIlKyGPZrxnB.jpg)
/rtv/media/media_files/2024/11/10/2vNkg3luKhk0FsNOFwdR.jpg)
/rtv/media/media_files/2024/11/01/rEHIiYMJ8VnRnp7ZYecI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-20-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-13-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/drone.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Russia-vs-Ukraine.jpg)