Arms Sales: యుద్దాల వల్ల 100 కంపెనీలకు రూ.53 లక్షల కోట్లు లాభం..

ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఇజ్రాయెల్, గాజా, ఇరాన్‌, లెబనాన్‌ ఇతర ప్రాంతాల్లో సంక్షోభాల వల్ల గతేడాది 100 ఆయుధ కంపెనీలు లాభపడ్డాయి. వీటికి 632 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.53 లక్షల కోట్లు వ్యాపారం జరిగినట్లు సిప్రి అనే నివేదిక వెల్లడించింది.

New Update
WAR TANK

ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఇజ్రాయెల్, గాజా, ఇరాన్‌, లెబనాన్‌ ఇతర ప్రాంతాల్లో సంక్షోభాల వల్ల గతేడాది ఆయుధ వ్యాపార కంపెనీలు బాగా లాభపడ్డాయి. ఈ విషయాన్ని సిప్రి (స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చి) తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 100 ఆయుధ కంపెనీలు 2023లో 632 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.53 లక్షల కోట్లు వ్యాపారం జరిగినట్లు పేర్కొంది. 2022తో పోలిస్తే ఇది 4.2 శాతం అధిక లాభమని వెల్లడించింది.   

Also Read: యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

Top 100 Defence Suppliers

2022లో చాలావరకు ఆయుధ కంపెనీలకు అంతగా డిమాండ్ లేదు. కానీ ఏడాది తర్వాత వాటి వ్యాపారం ఒక్కసారిగా పెరిగిపోయింది. తాము పరిశీలించిన కంపెనీల్లో ప్రతీ కంపెనీకి కనీసం 1 బిలియన్ డాలర్లకు (రూ.8.4 వేల కోట్లు) పైగా వ్యాపారం జరిగిందని సిప్రి తెలిపింది.  ఉక్రెయిన్, గాజా, ఇతర సంక్షోభాల వల్ల చిన్న ఉత్పత్తిదారులు కూడా డిమాండ్‌ను అందుకున్నారని పేర్కొంది. అయితే వీళ్లు ప్రత్యేకంగా పరికరాలు తయారుచేయడమో అలాగే సిస్టమ్స్‌ను నిర్మించడం లాంటి పనులు చేసేవారని నిపుణులు చెబుతున్నారు. 

Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం

భారీగా లాభం పొందిన 100 కంపెనీల్లో అమెరికాలోనే 41 ఉండటం గమనార్హం. ఈ కంపెనీలు ఆయుధ అమ్మకాల్లో గతేడాది 2.3 శాతం వృద్ధి సాధించాయి. కానీ అమెరికాలో పెద్ద ఆయుధ కంపెనీలైన లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియాన్‌ టెక్నాలజీస్‌ల ఆదాయం తగ్గింది. ఇందుకు కారణం ఇవి సంక్లిష్టమైన, పలు దశల పంపిణీ వ్యవస్థలపై ఆధారపడటమే. ఇక ఐరోపాలో 27 పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇవి కేవలం 0.2 శాతం మాత్రమే వృద్ధిని చూశాయి. ఇందుకు కారణం ఈ కంపెనీలు కూడా సంక్లిష్టమైన ఆయుధాలను తయారుచేయడమే. ఇక మరికొన్ని ఆయుధ తయారీ కంపెనీలు ఉక్రెయిన్ యుద్ధానికి కావాల్సిన ఆయుధాలను ఉత్పత్తి చేసే బాగానే లాభం పొందాయి.  

Also Read: ముంబైలో దారుణం.. యువతి బట్టలు విప్పించి డిజిటల్ అరెస్ట్..

ఇది కూడా చూడండి: విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా..

Advertisment
Advertisment
తాజా కథనాలు