ఉక్రెయిన్‌పై ఒకే నెలలో 2 వేల డ్రోన్ల దాడి.. రష్యా సంచలన ప్రకటన

రెండేళ్ల క్రితం మొదలైన రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ నెలలో ఉక్రెయిన్‌పై 2 వేల డ్రోన్లతో దాడి చేశామని రష్యా తెలిపింది. 20 సార్లు రష్యా డ్రోన్ దాడులు చేసినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు కూడా పేర్కొన్నాయి.

New Update
Ukrain

రెండేళ్ల క్రితం మొదలైన రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే అక్టోబర్ నెలలో ఉక్రెయిన్‌పై 2 వేల డ్రోన్లతో దాడి చేశామని రష్యా తెలిపింది. రాజధాని కీవ్‌ను నేలమట్టం చేసేందుకు అక్టోబర్‌లో 20 సార్లు రష్యా డ్రోన్ దాడులు చేసినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు కూడా పేర్కొన్నాయి. కేవలం నెల రోజుల్లోనే రష్యా 2,203 డ్రోన్లు ప్రయోగించిందని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 1,185 డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. ఇక మరో 738 డ్రోన్ల వల్ల నష్టం జరిగిందని అన్నారు.    

Also Read: హిందువులకు మద్దతుగా ట్రంప్.. దీపావళి వేళ కీలక ప్రకటన!

జనావాసాలు దెబ్బతీసే లక్ష్యంగా

 2023 ప్రారంభం నుంచే రష్యా మా దేశంపై 6,987 డ్రోన్లు ప్రయోగించిందని.. జనావాసాలు, మౌలిక సదుపాయలు దెబ్బతీసే లక్ష్యంగానే దాడులు చేస్తోందని తెలిపారు. ఇదిలాఉండగా.. గత రాత్తి రష్యా ఉక్రెయిన్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే తాము 31 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ దాడిలో రెండు ప్రాంతాల్లోని నివాస భవనాలు కూలిపోయాయని చెప్పింది. ఇక దక్షిణ ఒడెసా ప్రాంతంలోని ఓ ఫైర్ స్టేషన్‌ ధ్వంసమైనట్లు పేర్కొంది.    

మరోవైపు ఉక్రెయిన్ చేసిన ఆరోపణలు రష్యా ఖండించింది. జనావాసాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించింది. తమ దేశానికి ముప్పు పొంచి ఉందనే కారణంతోనే ఉక్రెయిన్ మిలటరీ మౌలిక సదుపాయాలను.. ఇంధన వ్యవస్థకు దెబ్బతీసేందుకే దాడులు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

Also Read: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలోకి నార్త్ కొరియా బలగాలు–ధృవీకరించిన​ అమెరికా

ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం ఆగాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నప్పటికీ కూడా దాని దిశగా అడుగులు పడటం లేదు. శాంతి చర్చలు కూడా విఫలమయ్యాయి. మరోవైపు పశ్చిమాసియాలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు మూడో ప్రపంచ ముప్పుకు దగ్గర్లోనే ఉన్నామని పలువురు నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.   

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు