Naa Love Story: 'నా లవ్‌ స్టోరీ' పోస్టర్‌ రిలీజ్‌.. ఆర్జీవీ బాటలోనే నయా డైరెక్టర్..!

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు తీస్తున్న మూవీ "నా లవ్ స్టోరీ" సినిమా పోస్టర్ ప్రేమికుల రోజు సందర్భంగా, 'మంగళవారం' సినిమా దర్శకుడు అజయ్ భూపతి రిలీజ్ చేసారు.

New Update
Naa Love Story Poster

Naa Love Story Poster

Naa Love Story: మోహిత్ పెద్దాడ హీరోగా నటిస్తున్న "నా లవ్ స్టోరీ" చిత్రానికి వినయ్ గోను(Vinay Gonu) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్లపై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను "మంగళవారం"(Mangalavaram Movie) చిత్ర దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) విడుదల చేశారు.

Also Read: అదానీ కేసు గురించి అడిగిన అమెరికా మీడియా.. ప్రధాని మోదీ షాకింగ్ రియాక్షన్

ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ, "వినయ్ గోను, నేను ఇద్దరం ఆర్జీవీ(RGV) గారి వద్ద అసిస్టెంట్స్‌గా పనిచేశాం. ఈ వాలంటైన్స్ డేకి, ప్రేమకథకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. పోస్టర్ చాలా ప్రత్యేకంగా ఉంది. వినయ్ గోను ఈ సినిమాతో పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను," అన్నారు.

Also Read: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!

ప్రతి ఒక్కరి ఫోన్‌లో రింగ్ టోన్‌గా..

దర్శకుడు వినయ్ గోను మాట్లాడుతూ, "పోస్టర్ విడుదల చేసిన అజయ్ భూపతికి కృతజ్ఞతలు" అని చెప్పారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ, "ప్రేమ కథలకు మ్యూజిక్ ఇచ్చే అవకాశం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. 'ఏం మాయ చేసావే' లాంటి మ్యూజికల్ హిట్స్ ఈ సినిమాకు ఇవ్వాలని అనుకుంటున్న, డైరెక్టర్ వినయ్ గారు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అందమైన ప్రేమ కథకు అద్భుతమైన సంగీతం అందించి, ప్రేమికుల రోజున ఈ సినిమాకి సంబంధించిన పాటలు ప్రతి ఒక్కరి ఫోన్‌లో రింగ్ టోన్‌గా మారాలని ఆశిస్తున్నాను," అని అన్నారు.

Also Read: మోదీ బీసీ కాదు.. కేసీఆర్‌కు తెలంగాణలో ఉండే హక్కు లేదు: రేవంత్ సంచలనం!

ఈ సినిమా తొలి షెడ్యూల్ మార్చి నెల మొదటి వారం ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు.

Also Read: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?

#latest film news telugu #rgv #ajay-bhupathi #rtv telugu news #naa love story
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు