KTR టార్గెట్‌గా రేవంత్ బిగ్ స్కెచ్..?
ఫార్ములా-ఈ కార్ల రేసింగ్ అంశంలో కేటీఆర్ చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లించారనే ఆరోపణలపై కేటీఆర్ అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

TG: ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్‌కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెండో విడత నుంచి మాత్రం రేషన్‌కార్డే ప్రామాణికం అవుతుందని తెలిపారు.
ఈ నెల 8న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయనున్నారు. యాదాద్రి జిల్లాలో మూసీ వెంట రైతులు, ప్రజలను కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.
తెలంగాణలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని మోదీ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన రెండో రోజే రెండు హామీలను అమలు చేశామని.. అలాగే రైతులకు రూ.2 లక్షల లోపు మాఫీ చేశామంటూ ట్వీట్ చేశారు.