Revanth: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. తెలంగాణాలో డే కేర్ సెంటర్‌లు! తెలంగాణ ప్రభుత్వం వర్కింగ్ మదర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. తల్లిదండ్రులిద్దరు ఉద్యోగానికి వెళితే పిల్లల సంరక్షణ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డే కేర్ సెంటర్‌లు ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, నియామక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు. By Archana 08 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update telangana షేర్ చేయండి Telangana : నేటి సమాజంలో జీవితం సాఫీగా సాగాలంటే ఇంట్లో భార్య భర్తలు ఇద్దరూ పని చేయాల్సి వస్తోంది. అయితే భార్య భర్తలిద్దరూ ఉద్యోగానికి వెళితే ఇంట్లో పిల్లల సంరక్షణ పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా ఊళ్ళల్లో రోజూ కూలి చేసుకొని జీవనం సాగించే కొంతమంది మహిళలు పిల్లల కోసం పనులు మానుకొని ఇంట్లోనే ఉంటున్నారు. అదే విధంగా ఉద్యోగాలు చేసే మహిళలు కూడా. దీని వల్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. Also Read : ఓర్నీ.. అక్కడ కూడా గంజాయి పెంచుతారా?.. వరంగల్ పోలీసుల షాక్! వర్కింగ్ మదర్స్ కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇలాంటి వర్కింగ్ మదర్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వర్కింగ్ మదర్స్ పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయానుంది. పట్టణాల మాదిరిగానే గ్రామాల్లో కూడా పిల్లల సంరక్షణ కోసం అంగన్‌వాడీ తరహాలోనే 'డే కేర్ సెంటర్లను' ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పిల్లల కారణంగా ఉద్యోగాలు మానేయకుండా.. మహిళల ఆర్థిక పరిపుష్టికి చేయూతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డే కేర్ సెంటర్‌లు అమలు చేయనుంది. Also Read: 3 స్టేట్స్.. 9 థియేటర్స్.. రామ్‌చరణ్ టీజర్ లాంచ్ ప్లాన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా భయ్యా! ప్రభుత్వం చేతిలో పిల్లల సంరక్షణ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ డే కేర్ సెంటర్లలో ఆరు నెలల నుంచి రెండున్నర ఏళ్ళ లోపు పిల్లల సంరక్షణను చూసుకోనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పిల్లల లాలన, పాలన ఉండబోతుంది. ఉద్యోగాలు, పనులకు వెళ్లే మహిళలు పిల్లలను ఈ డే కేర్ సెంటర్లలో అప్పగించి వెళ్ళవచ్చు. ఈ డే కేర్ సెంటర్లను అంగన్వాడీ తరహాలోనే నిర్వహించనున్నారు. Also Read : చిన్నప్పుడు స్టార్ హీరోలకు కూడా ఆ భాదలు తప్పలేదు..! అంగన్వాడీ తరహాలో అంగన్వాడీ కేంద్రాల మాదిరిగానే ఇక్కడ కూడా ఇద్దరు సహాయకులు ఉంటారు. పిల్లలకు కావాల్సిన ఫుడ్ పెట్టడం, నిద్రపుచ్చడం, ఆడించడం, వారికి కావాల్సిన అవసరాలను చూసుకోవడం చేస్తారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ డే కేర్ సెంటర్లలో సిబ్బంది నియామకాలపై కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన విధి విధానాలు, నియామక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు. Also Read: కులాంతర వివాహాలపై డేటా అందుకే సేకరిస్తున్నాం.. రేవంత్ కీలక ప్రకటన #revanth-reddy #telangana-government #working-womens మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి