తెలంగాణలో 4 లైన్ల హైవే.. ఈ జిల్లా వాసులకు పండగే
తెలంగాణలో మరో 4 లైన్ల రహదారి అందుబాటులోకి రాబోతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. హుస్నాబాద్-కొత్తపల్లి రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించనుంది. మొదటి దశగా రోడ్డు అభివృద్ధికి రూ.77.20కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.