Harish Rao: రైతుబంధును తీసేయాలని కుట్ర చేస్తున్నారు.. హరీశ్‌రావు ఫైర్
తమ ప్రభుత్వం రైతన్నకు కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ యాసంగి, వచ్చే వానాకాలానికి రైతుభరోసా కలిపి ఎకరాకు రూ.15 వేలు ఇవ్వకుండా మొండి చేయి చూపారంటూ విమర్శించారు.