నా క్యారెక్టర్ ను దెబ్బ కొట్టకు.. రేవంత్ రెడ్డికి బన్నీ కౌంటర్

తప్పుడు ఆరోపణలతో తన క్యారెక్టర్ ను దెబ్బ తీయవద్దని అల్లు అర్జున్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు.

author-image
By Anil Kumar
New Update

TG: సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ముందుగా రేవతి, శ్రీ తేజ్ కుటుంబానికి సారీ చెప్పారు. ఆ కుటుంబానికి జరిగింది చాలా బాధకరమన్నారు. థియేటర్ కు వచ్చిన వారిని నవ్వుతూ పంపించాలని కోరుకునే మనిషిని. థియేటర్ లో ప్రమాదం జరిగిందంటే నాకంటే బాధపడేవారు ఎవరు లేరన్నారు. శ్రీ తేజ్ కోలుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు.

మిస్ కమ్యూనికేషన్ వల్ల తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. గవర్నమెంట్ మద్ధతుగా నిలిచినందుకు థాంక్స్. 20 ఏళ్లుగా నేను ఇలా చేశానా? నా గురించి మొత్తం తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారు. నా క్యారెక్టర్ ను బ్యాడ్ గా క్రియేట్ చేస్తున్నారు. 30 ఏళ్లుగా సంధ్య థియేటర్ వెళ్తున్నాను. నేను పర్మిషన్ లేకుండా వెళ్లానని చెప్పడం బాధకరం.

నన్ను పోలీసులు కలవలేదు..

అన్ని జాగ్రత్తలు, పర్మిషన్స్ తర్వాతే నేను థియేటర్ వెళ్లాను. రోడ్ షో చేయలేదు. థియేటర్ దగ్గర కారు ఆగిపోగానే జనం పరిగెత్తుకొచ్చారు. నెమ్మదిగా ముందుకు వెళ్లండని చెప్పాను. కానీ రెచ్చగొట్టలేదు. డిస్ట్రబ్ చేయాలని చేయలేదు. నన్ను పోలీసులు కలవలేదు. జనం ఎక్కువయ్యారు వెళ్లిపోవాలని మా టీమ్ చెప్పగానే వెళ్లిపోయా. నా పిల్లలు నా పక్కనే ఉన్నారు. అలాంటిది నా అభిమాని చనిపోయారని తెలిస్తే తట్టుకుంటానా. 

అప్పటిదాకా తెలీదు..

ఇంటికి వెల్లిపోయిన తర్వాతే తెలిసింది. రేవతి చనిపోయిందని తెల్లవారు మా టీమ్ చెప్పారు. అప్పటిదాకా తెలియదు. హాస్పిటల్ కూడా రావొద్దని చెప్పారు. అప్పటికే ప్రమాదం జరిగింది. మళ్లీ హాస్పిటల్ వెళితే లిగల్ గా ఇబ్బంది పడతారని వివరించారు. దీంతో ఆగిపోయాను అని అన్నారు. ‘గతంలో పలువురి హీరోల అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వెళ్లాను. నా సొంత అభిమానులు చనిపోతే, వెళ్ల కలవనా? జరిగిన ఘటన విషయం తెలిసి షాక్‌లో ఉన్నా.

చాలా బాధేస్తుంది..

ఘటన జరిగిన తర్వాత ఏం చేయాలో తెలీక వీడియో పెట్టా. ఆ వీడియో కూడా డబ్బు కోసమని కాకుండా వాళ్ళ కోసం నేనున్నానని చెప్పడానికే.  ఇలా జరిగిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ అన్ని క్యానిల్ చేశాం. లీగల్ గా నేను వెళ్ళలేనని, బాబు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు స్పెషల్ పర్మిషన్ తో మా నాన్నను హాస్పిటల్ కి పంపాను. ఆ తర్వాత సుకుమార్ ను పంపించా. అలాంటిది నేను అసలు కేర్ చేయడం లేదని, నాపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు చాలా బాధేస్తుంది. మీరు థియేటర్‌కు వచ్చి ఎంజాయ్‌ చేయాలని నేను సినిమాలు చేస్తున్నా. గర్వపడేలా సినిమా  చేశానని అనుకునుకుంటే, మనల్ని మనం కిందకు లాక్కుంటున్నాం..' అంటూ చెప్పుకొచ్చాడు.

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు