TS: తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదించిన ప్రభుత్వం
తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటూ ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలను జరపాలని నిర్ణయించింది. దీన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జరుపుకోవాలని తెలిపింది.