బిల్కీస్ భానో... మహిళా రెజ్లర్లకు బీజేపీ రాఖీ కట్టాలి...!
రక్షా బంధన్ రోజు బిల్కీస్ భానో, మహిళా రెజ్లర్లకు బీజేపీ నేతలు రాఖీ కట్టాలని ప్రతిపక్షాలు సూచించాయి. ఈ రోజు రక్షా బంధన్ అని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. బిల్కీస్ భానో, మహిళా రెజ్లర్లకు, మణిపూర్ మహిళలకు బీజేపీ నేతలు రాఖీలు కట్టాలన్నారు. వాళ్లంతా దేశంలో సురక్షితంగా వున్నామని ఫీల్ కావాలని చెప్పారు. అందుకే తామంతా కలిసి వచ్చామన్నారు. ఇండియా కూటమి సమావేశం నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించారని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు.