Pavan Kalyan: రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఈ రాఖీ పండుగ రోజున పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలోని దాదాపు 1,500 మంది వితంతు మహిళలకు కానుకగా చీరలను పంపించారు. సమాజంలో ఒంటరిగా, రక్షణ లేకుండా ఉన్నారనే భావన ఉండకూడదని చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

New Update
Pavan Kalyan

Pavan Kalyan

రాఖీ పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. సోదరి, సోదరుడు మధ్య జరిగే పండుగ మాత్రమే కాదు.. వారికి రక్షణగా నిలవాలి. అయితే ఈ రాఖీ పండుగ రోజున పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలోని దాదాపు 1,500 మంది వితంతు మహిళలకు కానుకగా చీరలను పంపించారు. సాధారణంగా రాఖీ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి తమ రక్షణను కోరుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ వితంతు మహిళలకు రాఖీ గుర్తుగా ఇచ్చారు. సమాజంలో ఒంటరిగా, రక్షణ లేకుండా ఉన్నారనే భావన ఉండకూడదని, వారికి కూడా ఒక సోదరుడు ఉన్నాడని ధైర్యం ఇవ్వడానికి చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆయన పంపిన బహుమతులు కేవలం చీరలు మాత్రమే కాదు, వాటిలో ప్రేమ, గౌరవం, ఆత్మీయత వంటి ఎన్నో మంచి భావాలు దాగి ఉన్నాయని అంటున్నారు.

ఇది కూడా చూడండి: Raksha Bandhan: సీతక్క రాఖీ కట్టగానే నోట్ల కట్ట బహుమతిగా ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి.. వీడియో వైరల్!

ప్రతీ మహిళ ఇంటికి వెళ్లి..

పవన్ కళ్యాణ్ పంపిన చీరలను జనసేన పార్టీ కార్యకర్తలు స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ కానుకలను అందుకున్న మహిళల స్పందన హృదయాన్ని తాకేలా ఉంది. మొదట వారు కాస్త ఆశ్చర్యపోయినా, తర్వాత వారి కళ్లలో ఆనంద బాష్పాలు కనిపించాయి. పవన్ కళ్యాణ్ తమను కేవలం ఓటర్లుగా కాకుండా, తమ సొంత సోదరిగా భావించి ఈ బహుమతి పంపించడం వారిలో ఒక కొత్త ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. "నేను మీకు సోదరుడిని, మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను" అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు వారి మనసులకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక కానుకల పంపిణీ లాగా కాకుండా.. మహిళల మనసుల్లో ఆనందాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపేలా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

రాఖీ పండుగ ఆత్మీయతను చాటి చెప్పడమే..

ఈ కార్యక్రమం అసలైన ఉద్దేశం రాఖీ పండుగ ఆత్మీయతను చాటిచెప్పడమే అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వితంతు మహిళలతో సోదరభావాన్ని పంచుకోవాలని, వారికి మేమున్నాం అని భరోసా ఇవ్వాలని చెప్పారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పంపిన చీరలను నాయకులు, కార్యకర్తలు ఎంతో గౌరవంగా పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు, "ఇది పవన్ అన్నయ్య నుండి మీకు రాఖీ పండుగ శుభాకాంక్ష" అని చెబుతూ ఆ చీరను అందించారు. ఈ ప్రక్రియలో కేవలం బహుమతులు ఇచ్చి వెళ్లిపోవడం కాకుండా, మహిళలతో ఆప్యాయంగా మాట్లాడారు, వారి కష్టాలను విన్నారు. వారి భుజాలపై చేయి వేసి, తమ ప్రేమను చూపించారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: అన్నకు రాఖీ.. కేటీఆర్ ఇంటికి కవిత?

Advertisment
తాజా కథనాలు