Hyderabad: గూగుల్ మ్యాప్‌లో చావుని వెతుక్కుంటూ.. మూసీలో కొట్టుకుపోయిన బీటెక్ స్టూడెంట్

రాజేంద్రనగర్‌ మూసీ నదిలో బీటెక్ స్టూడెంట్ మృతి చెందాడు. అక్షిత్ రెడ్డి జీడిమెట్ల నుంచి ఫ్రెండ్స్‌తో గూగుల్‌ మ్యాప్‌‌లో వెతుకుంటూ రాజేంద్రనగర్‌కు వచ్చాడు. అంతా కలిసి సరదాగా మూసీలోకి ఈతకు దిగారు. అక్షిత్‌ రెడ్డి ఒక్కసారిగా మూసీ నదిలో కొట్టుకుపోయాడు.

New Update
musi river (1)

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. మూసీ నదిలో మునిగి బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మృతి చెందాడు. అక్షిత్ రెడ్డి జీడిమెట్ల నుంచి మరో ముగ్గురు ఫ్రెండ్స్‌తో గూగుల్‌ మ్యాప్‌‌లో వెతుకుంటూ రాజేంద్రనగర్‌కు వచ్చాడు. స్నేహితులు అంతా కలిసి సరదాగా మూసీ నదిలోకి ఈత కొట్టడానికి దిగారు. ఈ క్రమంలో అక్షిత్‌ రెడ్డి ఒక్కసారిగా మూసీ నదిలో కొట్టుకుపోయాడు. అక్షిత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వరద నీటి ఉదృతికి అక్షిత్ రెడ్డి కొట్టుకుపోయాడు. అక్షిత్ రెడ్డి కోసం DRF, రెస్క్యూ టీంలు గాలిస్తున్నాయి.  

Advertisment
తాజా కథనాలు