Weather alert: భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం..
ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ ప్రభావంతో మొత్తం 16 విమానాల దారి మళ్లించినట్లు ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే కాలుష్య కొరల్లో చిక్కుకున్న ఢిల్లీలో వర్షాలు కురవడం వల్ల కాలుష్యం కొంతవరకు తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.