Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరమంతా కూల్ అయిపోయింది. పలుచోట్ల వర్షం పడుతుంది. మియాపూర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌళిలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షం పడుతోంది.
పూర్తిగా చదవండి..Also Read: కరీంనగర్ లో ప్రేమ కిలాడి.. రూ.16 లక్షలతో జంప్!
ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అలాగే ఈనెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
[vuukle]